షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

585చూసినవారు
షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లారు. గురువారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్