మద్యం ప్రియులకు అడ్డాగా చెరువు తూము

594చూసినవారు
మద్యం ప్రియులకు అడ్డాగా చెరువు తూము
భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో మద్యం ప్రియులకు చెరువు కట్ట అడ్డాగా మారింది. గ్రామంలో గల వైన్స్ లో మద్యం కొనుగోలు చేసి మద్యం ప్రియులు చెరువు వద్దకు వెళ్లి బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. అంతేకాకుండా మద్యం సీసాలను ధ్వంసం చేసి చెరువులో వేస్తున్నారు. దీంతో అక్కడి ప్రాంతం అపరిశుభ్రంగా మారుతుంది. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్