దోమకొండలో జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

58చూసినవారు
దోమకొండలో జ్యోతిబాపూలే జయంతి వేడుకలు
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గురువారం మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జడ్పిటిసి తీగల తిర్మల్ గౌడ్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ ఐరేని నరసయ్య, మాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్, నాయకులు మధు, గోపాల్ రెడ్డి, భోలేశ్వర్, రవీందర్, పాత రాము, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్