కామారెడ్డి జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సన్నపల్లి లో శుక్రవారం ఘనంగా స్వయం పాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది.
తదనంతరం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సభాధ్యక్షులుగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేరీ వరదానం వ్యవహరించారు.
ఉపాధ్యాయులుగా వ్యవహరించిన 10వ తరగతి విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని తెలిపారు.