మాతా శిశు మరణాలను అరికట్టాలని, క్షేత్ర సిబ్బంది ప్రజలకు అవగాహన పెంపొందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో మాతా శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన మాతా శిశు మరణాలు నివారించగలిగినవి ఉన్నప్పటికినీ క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన రాహిత్యం వలన సంభవించాయన్నారు. మాతాశిశు మరణాల నివేదికలను ఏ రోజుకారోజు కలెక్టర్ కు సమర్పించాలని ఆదేశించారు.