చెరుకు పంటకు నీరు పెడుతుండగా ఒకరు మృతి

67చూసినవారు
చెరుకు పంటకు నీరు పెడుతుండగా ఒకరు మృతి
చెరుకు పంటకు నీరు పెడుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన రాచకొండ గంగయ్య అదే గ్రామానికి చెందిన ఇటిక్యాల శ్రీనివాస్ రెడ్డి వద్ద కూలీ పనుల కోసం వెళ్లినట్లు చెప్పారు. ఆయన వ్యవసాయ బావి వద్ద చెరుకు పంటకు నీరు పెడుతున్నట్టు చెప్పారు. అదే సమయంలో కాలుజారి నీరు ప్రవహిస్తున్న కాలువలో పడి మృతి చెందినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్