ఎల్లారెడ్డి సెగ్మెంట్ గాంధారీ మండలం గుర్జల్ తండా గ్రామ మాజీ బీఆర్ఎస్ ఎంపీటీసీ రాంచందర్, బీఆర్ఎస్ నేత రౌఢ్యహస్రాజ్ కలిసి మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె. మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వీరికి ఎమ్యెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గాంధారి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వున్నారు.