ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని తాడ్వాయి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్త ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు పంపిణీకి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు తాడ్వాయి ఎస్ఐ. వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టుబడిన కార్యకర్త నుండి 10, 100 నగదు, పార్టీ కండువాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.