బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో పుల్కల్ ప్రధానోపాధ్యాయులు రాజుల గ్రామ వాసి ఈశ్వర్ కుశాల్ పదవీ విరమణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పిటిసిఎన్ రాజు, శ్రీహరి, మండల పార్టీ అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, మాజీ సర్పంచ్ హనుమాన్లు గోపన్పల్లి, ఎంపిటిసి సభ్యులు కొట్టే రాములు తదితరులు పాల్గొన్నారు.