ఎల్కతుర్తి ఢీకొన్న బైక్, పోలీసు వాహనం

3332చూసినవారు
ఎల్కతుర్తి ఢీకొన్న బైక్, పోలీసు వాహనం
కరీంనగర్ - వరంగల్ అర్బన్ ప్రధాన రహదారిపై శుక్రవారం నాడు ఓ పోలీస్ ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పోలీస్ వ్యాన్ హనుమకొండకు వెళ్తుండగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంకు చెందిన ఇద్దరు వ్యక్తులు వరంగల్ నుంచి బైక్ పై వస్తున్నారు. ఈ క్రమంలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఎల్కతుర్తి వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైకు మీద ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. దీంతో వారిని పోలీసులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :