ఐఐటీ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థుల ప్రభంజనం

82చూసినవారు
ఐఐటీ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థుల ప్రభంజనం
ఇటీవల ప్రకటించబడిన ఐ.ఐ.టి అడ్వాన్స్డ్- 2024 ఫలితాలలో మా అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.నరేందర్ రెడ్డి తెలిపారు. యం.హర్షిత్ 64వ ర్యాంకు సాదించగా, జి. శ్రీహాస్ 290, బి. భరద్వాజ్ 396, ఆర్. పునీత్ మనోహర్ 477, సుబోద్ చౌదరి 545, ఎ.శివవరుణ్ 557, పి.రాహుల్ 571, దేవదత్త 751, విశాల్ రెడ్డి 838, డి. రిశ్వంత్ కుమార్ 1029, పి. మనోహర్ 1229, నిహాల్ 1379, ఆదిత్యవర్ధన్ రావు 1523, లహరి 1609, అరుణ్ కుమార్ 1658, బి. అభినవ్ సిదార్ధ రెడ్డి 1851, సత్య అమూల్య 1933 ర్యాంకులు సాధించి “అల్ఫోర్స్” ఖ్యాతిని మరింత పెంచారని తెలిపారు. 1,000 లోపు 9 మంది విద్యార్థులు, 2,000 లోపు 17 మంది విద్యార్థులు, 5,000 లోపు 32 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం గొప్ప విశేషం అన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ మరియు విద్యార్థుల ఆహర్నిష కృషి ఇంతటి ఘనవిజయానికి తోడ్పడ్డాయన్నారు. ప్రతి సంవత్సరం ఆల్ఫోర్స్ అందించిన ఐఐటి కోచింగ్ ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటిలలో సీట్లు సాదించే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఐఐటి-2024 ఫలితాలలో అద్భుత ర్యాంకులు సాధించిన మా అల్ఫోర్స్ విద్యార్థులను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్