Top 10 viral news 🔥
వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు: పవన్
ఈ భూమి మీద చెట్లు చేమలు, జంతువులు, పశు పక్షాదులకు మనలాగే బతికే హక్కు ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వన్యప్రాణులను వేటాడి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన శిక్షలుంటాయని హెచ్చరించారు. ఈ మేరకు వన్యప్రాణుల సంరక్షణ కోసం యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్‌ను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. వన్యప్రాణులను రక్షించేందుకు 1800-4255909 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో తీసుకొచ్చారు.