మరికొన్ని గంటల్లో పెళ్లి.. గుండెపోటుతో వరుడు మృతి (వీడియో)
మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా గుండెపోటుతో వరుడు మృతి చెందిన విషాద ఘటన యూపీలోని హత్రాస్‌లో వెలుగు చూసింది. ఆగ్రా నివాసి మోహినితో శివమ్ వివాహం నిశ్చయమైంది. సోమవారం వివాహం ఉండడంతో ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి హల్దీ వేడుకలో సంతోషంగా డ్యాన్స్ చేసిన శివమ్ అలసిపోయి కూర్చున్నాడు. అకస్మాత్తుగా కుప్పకూలిన ఆయనను కుటుంబికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే శివమ్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.