సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విషయంలో నిన్న స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా శనివారం పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. మండలంలోని పలు గ్రామాల్లో హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వొడితల ప్రణవ్ చెక్కుల పంపిణీకి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు మధ్య కొనసాగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక స్థానిక ప్రజల్లో తీవ్ర ఉత్కంఠగా చూస్తున్నారు.