పాఠశాలలు పునః ప్రారంభం కానున్న దృష్ట్యా తరగతి గదులు శుభ్ర పరచడం, మౌలిక సదుపాయాలు కల్పించడం జరగాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. సోమవారం ఐడివోసి సమావేశ మందిరంలో పాఠశాలల పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించడం, పాఠ్య , నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించడం జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దివాకర, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.