సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని గురువారం జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫోటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ అరీఫ్ అలీ ఖాన్, ఆర్ఐ వేణు, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.