రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయి: సజ్జల
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. బాలికలు, మహిళలపై నేరాలు, అఘాయ్యితాలు పెరిగిపోయాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా.. సీఎం కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారన్నారు. ఓటాన్ అకౌంట్‌తోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమన్నారు.