జగిత్యాల పట్టణంలో బెస్ట్ అవేలబుల్ స్కూల్ ను కేటాయించాలని మాదిగ యువజన సంఘ సభ్యులు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. జగిత్యాల నుండి 15 కిమి దూరంలో ఉన్న స్కూల్లను కేటాయించడం వల్ల ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ యువజన సేవా సంఘం 11వ వార్డు అధ్యక్షుడు బొల్లారపు మహేష్ పాల్గొన్నారు.