వీధి కుక్కల దాడుల్లో చిన్నారులకు తీవ్ర గాయాలు

75చూసినవారు
వీధి కుక్కల దాడుల్లో చిన్నారులకు తీవ్ర గాయాలు
మంథని మండలం స్వర్ణపల్లి గ్రామంలో ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న నలుబోతుల మానస శ్రీ (5), కొరవేన వేదాన్ష్ (3) అనే ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. దాడిలో తీవ్ర గాయాలు అయిన చిన్నారులను మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఊర్లో వీధి కుక్కల వల్ల అనేక సంఘటనలు జరుగుతున్నాయి. అధికారులు పట్టించుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్