రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామ అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం అంగన్‌వాడీ బడిబాటను నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ శారద హాజరై తల్లులకు అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు బోధనతో పాటు ప్రభుత్వం పౌష్టికాహారం అందిఅటుందని వివరించారు. ఈకార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు రజిత, అనసూర్య, రమాదేవితోపాటు సిబ్బంది పాల్గొన్నారు.