పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు మంగళవారం కృష్ణా జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు ఎమ్మెల్యే విజయరమణరావు, కుటుంబ సభ్యులకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.