కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 7 ఏళ్ళ జైలు శిక్ష
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు భారీ షాక్ తగిలింది. బేలెకేరి పోర్టు నుంచి ఇనుప ఖనిజాన్ని తరలించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వార కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ శైల్కు ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.9.60 కోట్ల జరిమానాను విధిస్తూ శనివారం తీర్పు ప్రకటించింది. ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారనే ఆరోపణలపై 2010లో ఆయనపై కేసు నమోదైంది. దీంతో సతీష్ శైల్ ఎమ్మెల్యే పదవి కోల్పోనున్నట్లు తెలుస్తోంది.