ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: రాజేంద్రప్రసాద్
డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ప్రయాణం ఆరంభించిన రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఎన్నో విభిన్న చిత్రాల్లో నటించారు. తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే కెరీర్ ఆరంభంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అవకాశాల్లేక తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. డబ్బుల్లేక దాదాపు మూడు నెలలు అన్నం తినలేదన్నారు.