ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభామేళాలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పాల్గొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి సోమవారం మహా కుంభమేళాకు విచ్చేసిన ఆమె.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా కుంభమేళా ఈనెల 26న ముగియనుండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు.