సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ ఎమర్జెన్సీ పిటిషన్‌

68చూసినవారు
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ ఎమర్జెన్సీ పిటిషన్‌
ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్యం విధానం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. అత్యవసర విచారణ కోరుతూ ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు హాజరుకానున్నట్లు తెలిపాయి. కాగా ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్