డీకే శివకుమార్ చేతబడి వ్యాఖ్యలపై స్పందించిన కేరళ

50చూసినవారు
డీకే శివకుమార్ చేతబడి వ్యాఖ్యలపై స్పందించిన కేరళ
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తనను, సీఎం సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కేరళలో ఒక ఆలయంలో చేతబడి పూజలు చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కేరళ ప్రభుత్వం స్పందించింది. దేవదాయ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలోని దేవాలయానికి సమీపంలో ఎటువంటి జంతుబలి జరగలేదని స్పష్టం చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అన్నారు.

సంబంధిత పోస్ట్