కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన మలయాళీల కుటుంబ సభ్యులకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు కేరళ కేబినేట్ ప్రకటించింది. అలాగే గాయపడిన మలయాళీలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెల్లించాలని గురువారం జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. గాయపడిన మలయాళీలకు చికిత్స అందించడం, మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అత్యవసరంగా కువైట్ వెళ్లనున్నారని పేర్కొంది.