రానా సినిమాలో కేజీఎఫ్ హీరోయిన్?

51చూసినవారు
రానా సినిమాలో కేజీఎఫ్ హీరోయిన్?
'కేజీఎఫ్' హీరోయిన్ శ్రీనిధి శెట్టి టాలీవుడ్‌లో మరో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. కిశోర్ అనే కొత్త దర్శకుడితో రానా హీరోగా చేయబోయే సినిమాలో ఆమె నటించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీనిధి తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’ అనే మూవీ చేస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ ‘వేట్టయాన్’లో రానా కీలకపాత్ర పోషిస్తున్నారు. తేజ దర్శకత్వంలోనూ ‘రాక్షస రాజ్యం’ అనే మూవీ చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్