3లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా కార్యాచరణ చేపట్టాలి

73చూసినవారు
3లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా కార్యాచరణ చేపట్టాలి
3లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా ఇందిరా డెయిరీ కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. శ్రీజతో కలిసి ఇందిరా డెయిరీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరా డెయిరీ విజయవంతంగా నిర్వహణకు గాను పాల ఉత్పత్తి, పాల సేకరణ, మార్కెటింగ్ కి, రవాణాకి పకడ్బందీ ప్రణాళిక చేయాలన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్