మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించనున్న నీట్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయని పరీక్షల ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ ఆర్. పార్వతీరెడ్డి తెలిపారు. శుక్రవారం పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశమై మాట్లాడారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బంది ఎదురుకాకుండా చూడాలని, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించడంతో పాటు తాగునీటి వసతి, జామర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.