వాతవరణంలో మార్పులు.. పలుచోట్ల వర్షం

5136చూసినవారు
వాతవరణంలో మార్పులు.. పలుచోట్ల వర్షం
వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఆ తర్వాత జిల్లాలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఖమ్మం నగరంలోనూ ఆకాశం మేఘావృతమైంది. సత్తుపల్లి, వైరా, మధిర వ్యవసాయ డివిజన్లలో పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కాగా, జిల్లా వ్యాప్తంగా 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైంది.

సంబంధిత పోస్ట్