నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

58చూసినవారు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శని, ఆదివారాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 11గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కొత్తగూడెంలో రోడ్ షో, బహిరంగసభల్లో పాల్గొంటారు. ఆతర్వాత సత్తుపల్లికి చేరుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరవుతారు. ఆతర్వాత ఖమ్మం వచ్చి బస చేస్తారు. ఆదివారం బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాల్లో జరిగే కార్యక్రమాల్లో భట్టి పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్