అవినీతిలో జగన్.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు: మంత్రి గొట్టిపాటి
అవినీతిలో జగన్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జగన్ అవినీతిపై కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తున్నారు. విద్యుత్ ఒప్పందాలతో జగన్ అవినీతి చేశారని ఆరోపిస్తున్నారు. బాలినేని లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. జగన్ అవినీతి వల్ల అంతర్జాతీయంగా ఏపీ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి వచ్చింది.’ అని అన్నారు.