మొబైల్ కోర్టు జడ్జిగా నాగలక్ష్మి

77చూసినవారు
మొబైల్ కోర్టు జడ్జిగా నాగలక్ష్మి
ఖమ్మం సంచార న్యాయస్థానం న్యాయమూర్తిగా నియమితులైన బక్కెర నాగలక్ష్మి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హన్మకొండకు చెందిన ఆమె కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 2014లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించగా, 2023 లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడంతో మొదటి పోస్టింగ్ ఖమ్మంలో వచ్చింది. ఆమె ఇద్దరు సోదరులు న్యాయవాదులు కాగా, మరో సోదరుడు ఏపీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

సంబంధిత పోస్ట్