డీసీసీబీ చైర్మన్ కూరాకులపై నేడు అవిశ్వాసం

2213చూసినవారు
డీసీసీబీ చైర్మన్ కూరాకులపై నేడు అవిశ్వాసం
ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న వీ. వెంకటాయపాలెం సొసైటీ చైర్మన్ పదవికి శనివారం అవిశ్వాస సమావేశం జరగబోతుంది. వి వెంకటాయపాలెం సొసైటీ చైర్మన్ గా ఉన్న ఆయనపై అవిశ్వాసం ప్రకటిస్తూ సొసైటీలోని 13మంది డైరెక్టర్లలో 11మంది సంతకాలు చేసి డీసీవోకు అందజేశారు. దీంతో డీసీవో అవిశ్వాస ప్రక్రియకు గాను శనివారం ఆ సొసైటీ కార్యాలయంలో ఉదయం 11గంటలకు సమవేశం ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్