కేంద్ర ప్రభుత్వం తక్షణమే రుణ విమోచన చట్టాన్ని అమలు చేయాలని, రైతుల పంటలకు మద్దతు ధర కల్పించాలని, కార్మికుల హక్కుల్ని పరిరక్షించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు డిమాండ్ చేశారు. వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలో ట్రాక్టర్లు, ద్వీచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలోని
బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చారని ఆరోపించారు.