ఫ్రీ గ్యాస్ సిలిండర్.. ఇలా బుక్ చేసుకోండి
ఏపీలో దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే పాత విధానంలోనే గ్యాస్ ఏజెన్సీ నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ఆయిల్ కంపెనీ యాప్ లోనూ అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతాలు లింక్ అయిన గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము అకౌంట్లలో జమ అవుతుంది. సిలిండర్ తీసుకునేటప్పుడు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో అంతే మొత్తం ఖాతాల్లో జమ చేస్తారు.