బోదులబండలో అగ్నిప్రమాదం

69చూసినవారు
బోదులబండలో అగ్నిప్రమాదం
నేలకొండపల్లి మండలం బోదులబండలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలో వేముల బాబుకు చెందిన వరిగడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో దాదాపు 150 వరిగడ్డి దిండ్లు కాలిపోతుండగా, స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. అయినా సాధ్యం కాకపోవడంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది సమన్వయంతో మంటలను అదుపు చేశారు. ఇళ్ల మధ్య మంటలు చెలరేగగా సమయానికి ఆర్పడంతో ప్రమాదం తప్పినట్లయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్