గంజాయి నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి

60చూసినవారు
గంజాయి నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి
గ్రామీణ యువత గంజాయికి బానిసలు అవుతున్నారని, గంజాయి నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండలం ఎదులాపూరంలో సోమవారం డివైఎఫ్ఐ గ్రామ కమిటీ సమావేశాన్ని పవన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గంజాయి మత్తులో యువకులు నేరాలకు పాల్పడుతున్నారని, గంజాయి విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు.

సంబంధిత పోస్ట్