రెజొనెన్స్‌ స్కూల్‌ లో ఘనంగా గణతంత్ర దిన్సోతవ వేడుకలు

80చూసినవారు
రెజొనెన్స్‌ స్కూల్‌ లో ఘనంగా గణతంత్ర దిన్సోతవ వేడుకలు
స్థానిక శ్రీనగర్‌ కాలనీలో గల రెజొనెన్స్‌ స్కూల్‌ నందు 75వ గణతంత్ర దిన్సోతవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో పాఠశాల డైరెక్టర్‌ కొండా శ్రీధర్‌ రావు గారు ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వసత్తాక సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిందని రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ ‘‘ఎందరో మహానుభావుల పోరాటాల ఫలితమే ఈ రిపబ్లిక్‌ డే’’ అని ఈ రోజు భారతదేశం యొక్క చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజని, 1930లో భారత జాతీయ కాంగ్రేస్‌ లాహోర్‌ సభలో జనవరి 26న సంపూర్ణ స్వరాజ్యాన్ని ప్రకటించింది. రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేసి 1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని ఆమోదించి 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకవచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. మనదేశం స్వతంత్రం తరువాత భారతీయ పార్లమెంట్‌లో పూర్తిగా ప్రజాస్వామ్య గణతంత్రం అయ్యింది అంటూ, మనమందరం ప్రాధమిక హక్కులను కాపాడుకుంటూ ప్రాధమిక విధులను నిర్వర్తిస్తూ ప్రతి ఒక్కరు రాజ్యాంగ బద్దంగా జీవించాలని రెజొనెన్స్‌ స్కూల్‌ శ్రీనగర్‌ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తూ సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తూ విద్యార్థులను నూతన ఆవిష్కరణలవైపు ఆలోచింపచేసేలా విద్యాభోదన చేస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని తెలియజేసారు. రెజొనెన్స్‌ పాఠశాల డైరెక్టర్‌ కొండా కృష్ణవేణిగారు మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారతరాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారని విద్యార్ధులు అందరూ రాజ్యంగ విలువలను కాపాడుతూ ఉత్తమ పౌరులుగా ఉన్నత స్థానాలకు ఎదగటానికి రెజొనెన్స్‌ శ్రీనగర్‌ పాఠశాల మంచి వేదికగా ఉంటూ విలువలతో కూడిన విద్యను అందిస్తామని తెలియజేశారు.విద్యార్థులు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ నాయకుల వేషాధారనలో ఫ్యాన్సీ డ్రెస్‌లలో చిన్న చిన్న పిల్లలు ఆకర్షణగా నిలిచారు. సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్ధులు సందడి చేశారు మరియు ఆటపాటలలో గెలుపొందినవారికి బహుమతులు ఇచ్చి పాఠశాల యాజమాన్యం విద్యార్ధులను ప్రోత్సహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రెజొనెన్స్‌ ప్రధానోపాధ్యాయులు యం.ప్రసన్నరావు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతరులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్