స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి

54చూసినవారు
స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి
స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరిగా ఉండాలని సత్తుపల్లి ఎంవీఐ జె. యోగేశ్వర్ సింగ్ జాదవ్ స్పష్టం చేశారు. సత్తుపల్లి రవాణాశాఖ కార్యాలయంలో మంగళవారం స్కూల్ బస్సుల ఫిట్ నెస్ను తనిఖీ చేశారు. ప్రతి బస్సుకు ఫస్ట్ ఎయిడ్ కిట్, ఎమర్జెన్సీ ద్వారం, ఫైర్ పరికరాలు, రేడియం స్టిక్కరింగ్, ఇండికేటర్స్, సీట్ కండీషన్స్ తప్పనిసరిగా ఉండాలని పేర్కోన్నారు. స్కూల్ బస్సు లోపల డ్రైవర్, అటెండర్ ఫొటోలు అంటించాలని తెలిపారు.

ట్యాగ్స్ :