పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి

1869చూసినవారు
పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంభాని చంద్రశేఖర్ ప్రధాన అనుచరుడు పరెడ్ల సత్యనారాయణ రెడ్డి పార్థివ దేహానికి శనివారం మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి పార్థివ దేహాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గం నుంచి బెల్లం శ్రీనివాస్, మొహమ్మద్ హపీజుద్దీన్, రామసహయం అరవింద్ రెడ్డి, షేక్.కరీం, కొత్తగూడెం నుంచి సంతయ్య, నాగేందర్, ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్