మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శనీయం: ఎమ్మెల్యే

56చూసినవారు
మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శనీయం: ఎమ్మెల్యే
జాతిపిత మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్బంగా గురువారం సత్తుపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్లో గల అయన విగ్రహానికి ఎమ్మెల్యే మట్టా రాగమయి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఫూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావితరాలకు సైతం మార్గదర్శకుడని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్