నిలిచిన ఆర్టీసీ బస్సు... ప్రయాణికుల ఇక్కట్లు

55చూసినవారు
నిలిచిన ఆర్టీసీ బస్సు... ప్రయాణికుల ఇక్కట్లు
సత్తుపల్లి బస్టాండ్ నుంచి బయలుదేరిన బస్సు స్థానిక జేవీఆర్ డిగ్రీ కళాశాల వరకు వెళ్లే సరికి ఆగిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సు గేర్లు పని చేయకపోవటంతో డ్రైవర్ బస్సును నిలిపివేశారు. బస్సు కండీషన్ చూసుకోకుండా ఎలా తిప్పుతున్నారంటూ సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రయాణికులు మరో బస్సు ఎక్కాల్సి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్