కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామపంచాయతీలో గల కాంప్లెక్స్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పంచాయతీ పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ లో గల ఈ కాంప్లెక్స్ లో అనేక మంది వ్యాపారాలు తమకు అనువైన వ్యాపారాలు చేస్తూ గ్రామపంచాయతీ అభివృద్ధికి అద్దెలు చెల్లిస్తున్నారు. కాంప్లెక్స్ భవనం పూర్తిగా చేరుకోవడంతో వ్యాపారులు దాంట్లో ఉండేందుకు నిరాకరిస్తున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.