ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ వర్కర్ల ఆందోళన

69చూసినవారు
కారేపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు సోమవారం ఆందోళన దిగారు. మండల పరిధిలోని 41 గ్రామపంచాయతీలలో మల్టీపర్పస్ వర్కర్లుగా పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆందోళన దిగారు. తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్&ఎంప్లాయిస్ (సిఐటియు అనుబంధం)ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎంపీ ఓ పర్వీన్ కైసర్ కు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్