భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

4475చూసినవారు
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
మనస్తాపంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం కామేపల్లి మండలం భాసిత్ నగర్లో జరిగింది. ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన బాదావత్ రవి (38) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతుండటంతో భార్య సుశీల అతణ్ని మందలించటంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ ఘటనపై ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్