కబడ్డీ పోటీలలో విజేతగా నిలిచిన కొమ్ముగూడెం జట్టు

52చూసినవారు
కబడ్డీ పోటీలలో విజేతగా నిలిచిన కొమ్ముగూడెం జట్టు
కారేపల్లి మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో మూడు రోజుల పాటు జరిగిన కబడ్డీ పోటీలు బుధవారం రాత్రి ముగిశాయి. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినం, పోలేరమ్మ జాతర సందర్భంగా గ్రామ పెద్దలు, ఆదివాసీ యూత్ కొమ్ముగుడెం ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సంవత్సరం ఏడో తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగాయి. ఈ కబడ్డీ పోటీలలో మొదటి బహుమతి కొమ్ముగూడెం, రెండో బహుమతి పుటాని తండా, మూడవ బహుమతి గురిమెళ్ళ గెలుపొందాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్