పోలీస్ పహారా మధ్య పండితాపురం గ్రామం

64చూసినవారు
పోలీస్ పహారా మధ్య పండితాపురం గ్రామం
కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో మరోమారు రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వర్గీయులు ఒకరిపై ఒకరు కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరువర్గల్లో నలుగురికి గాయాలైయ్యాయి. దీంతో గ్రామంలో 144 సెక్షన్ విధించారు. ఉగాది పండగ పురస్కరించుకొని గురువారం రాత్రి పండితాపురం గ్రామంలో ఎడ్ల బండ్లపై ప్రభ ఊరేగింపు సమయంలో రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది.

సంబంధిత పోస్ట్