కారేపల్లి మండల వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకి పెరిగిపోవడంతో జనం గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం అయితే ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఉదయం 9 గంటల వరకు పొగమంచు కమ్మేస్తుంది. ఉదయం 10 తర్వాత ఎండ కాస్తున్న శీతల గాలులు వణికిస్తున్నాయి. చలికి రోడ్లన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, యాచకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివరాత్రి, సంక్రాంతి ముగిసేవరకు చలి తీవ్రత తీవ్రంగా ఉంటుంది.